‘విశ్వంభర’ మూవీ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ.. కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara).

‘విశ్వంభర’ మూవీ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ.. కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట(Vasishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ ట్రోలింగ్‌కు గురయ్యాయి. దీంతో చిత్రబృందం గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులను హాలీవుడ్ స్టూడియోకు అప్పగించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులోని ఐటెం సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ పాటలో మౌని రాయ్(Mouni Roy) మెగాస్టార్ సరసన చిందులేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ఈ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుపుతూ తన టీమ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్ చేసింది. ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మూడు, నాలుగు రోజులపాటు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మౌనితో చిరు స్టేప్పులు ఏ రేంజులో ఉంటాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




Next Story