- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: చీటింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటి, నటుడు
by Satheesh |
మోసాలకు పాల్పడుతోన్న బాలీవుడ్ నటి, నటుడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మోసాలకు పాల్పడుతోన్న బాలీవుడ్ నటి, నటుడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైల్డ్ మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన నటి నటాషా కపూర్, అపూర్ అశ్విన్‌ను సోమవారం సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ర్యాంప్ షోలలో అవకాశాలు కల్పిస్తామంటూ వీరు పలువురిని చీటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందనాతో మోడలింగ్ చేసే అవకాశం కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అయితే వ్యాపార వేత్తల పిల్లలే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఓ వ్యాపార వేత్త నుండి రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కాగా, వీరు కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో వైబ్ సైట్‌ను నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
Next Story






