బోల్డ్ సన్నివేశాలతో షేక్ చేసిన ‘మంగళవారం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

by Disha Web Desk 9 |
బోల్డ్ సన్నివేశాలతో షేక్ చేసిన ‘మంగళవారం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రంపై ప్రేక్షకులు ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఇందులో Rx 100 వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో నటించిన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీని ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు చూపించారట. వారి కోసం వేసిన స్పెషల్ షోకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. వారి టాక్ ప్రకారం.. సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాత పాయల్ రోల్ వస్తుందట. అప్పటి వరకు క్రియేట్ చేసిన సస్పెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టి పారేయడమే కాకుండా సెల్ ఫోన్లు కూడా చూడకుండా చేస్తాయని సమాచారం.

ఆ తర్వాత కొంత డ్రామా నడిచినా ఇంటర్వెల్ బ్లాక్‌లో ఒక షాకింగ్ ఎపిసోడ్ తో ఎండ్ అయ్యి.. సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతుందట. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయంటున్నారు. డైరెక్టర్ ఊహించని విధంగా క్లైమాక్స్ డిజైన్ చేశాడట. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నా.. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వడంతో ఖచ్చితంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటున్నారు. ముఖ్యంగా కొన్ని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకొచ్చినా.. వెంటాడతాయని చెబుతున్నారు. సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం రేపటి (నవంబరు 17) వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story

Most Viewed