- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబీ డియోల్ ‘బందర్’ మూవీ టీజర్ అప్డేట్.. బంధీలు కావడానికి సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
బాబీ డియోల్ అదిరిపోయే షిమ్మరీ జాకెట్ ధరించి, చేతిలో ఎలక్ట్రిక్ గిటార్ పట్టుకుని కనిపిస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు బాబీ డియోల్ తదుపరి చిత్రం ‘బందర్’ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి బాబీ డియోల్ స్టైలిష్ లుక్‌ను విడుదల చేస్తూ, టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్ట్‌కు.. బంధీలు కావడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. బాబీ డియోల్ అదిరిపోయే షిమ్మరీ జాకెట్ ధరించి, చేతిలో ఎలక్ట్రిక్ గిటార్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన లుక్ చూస్తుంటే 90వ దశకంలోని ఒక పాపులర్ రాక్‌స్టార్‌ను గుర్తుకు తెస్తోంది. బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా, ఎడ్జీగా ఉండబోతుందని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.
విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ ద్వివేదికి చెందిన సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. పాాతాళ్ లోక్, ఉడ్తా పంజాబ్ వంటి అద్భుతమైన కథలను అందించిన సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ క్రేజీ టీమ్ తోడవ్వడంతో ‘బందర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాబీ డియోల్‌తో పాటు సన్యా మల్హోత్రా, సప్నా పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, జితేంద్ర జోషి, రాజ్ బి. శెట్టి వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అనురాగ్ కశ్యప్ మార్క్ రా అండ్ రస్టిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. జీ స్టూడియోస్ ద్వారా విడుదల కానున్న ‘బందర్’, జూన్ 5న థియేటర్లలోకి రాబోతోంది.






