- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ స్పెషల్‌గా బాబీ డియోల్ ‘బందర్’.. రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీతో పాటు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషన్ బాబీ డియోల్(Bobby Deol) హీరోగా, దర్శక దిగ్గజం అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బందర్’ (Bander)మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 22, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘‘మే 22న థియేటర్లలో కలుద్దాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కావడానికి ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2025లో జరిగిన 50వ టొరంటో అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో (TIFF) ఈ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సమాచారం.
అక్కడ ‘స్పెషల్ ప్రెజెంటేషన్’ విభాగంలో స్క్రీనింగ్ అయిన ఈ మూవీకి విదేశీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. అనురాగ్ కశ్యప్ తనదైన క్రైమ్ సోషియో-పొలిటికల్ శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టాక్. గతంలో అనురాగ్‌తో కలిసి పనిచేసిన సుదీప్ శర్మ ఈ చిత్రానికి కథ అందించగా, అభిషేక్ బెనర్జీ స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ ద్వివేది నిర్మించిన ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. బాబీ డియోల్‌తో పాటు ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి, సప్నా పబ్బి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా కథాంశంపై మేకర్స్ ఇప్పటివరకు గోప్యత పాటించినప్పటికీ, ఇదొక పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామాగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.






