'పులి మేక‌'.. బాబీ, సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన ట్రైలర్!

by Disha Web Desk 7 |
పులి మేక‌.. బాబీ, సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించిన ట్రైలర్!
X

దిశ, సినిమా: లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌, సిరి హ‌న్మంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'పులి మేక'. జీ5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంయుక్త నిర్మాణంలో కే చ‌క్రవ‌ర్తి రెడ్డి తెరకెక్కించిన సినిమా ఫిబ్రవ‌రి 24న‌ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైల‌ర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్.

'చావు చెప్పిరాదు. వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పించుకోవ‌డం సాధ్యం కాదు' అనే భయంకరమైన డైలాగులతో మొదలైన ట్రైల‌ర్‌‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో క‌నిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ఓ సైకో టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న కేసును డీల్ చేయ‌డం కోసం అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీస‌ర్ కిర‌ణ్ ప్రభ (లావ‌ణ్య)కు ఎవరు సాయం చేశారు? ఈ క‌థ‌లో పులి-మేక ఎవరు? కిర‌ణ్ ప్రభ అండ్ ప్రభాక‌ర్‌ టీమ్ చేసే ప్రయ‌త్నం ఫ‌లించిందా? లాక్‌ డౌన్‌లో ప్రభాక‌ర్‌ చూసిన సిరీస్‌ కేసుకు ఏమైనా హెల్ప్ చేసిందా? అనేది కథ.


Next Story

Most Viewed