బ్లడీ వాలెంటైన్.. వయొలెన్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న DC సినిమా గ్లింప్స్

by Mallepaka Hamsa |

‘బ్లడీ వాలెంటైన్’ పేరుతో ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు.

బ్లడీ వాలెంటైన్.. వయొలెన్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న DC సినిమా గ్లింప్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)మెగాఫోన్ వదిలి హీరోగా కెమెరా ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా పరిచయమవుతున్న భారీ చిత్రం ‘DC’ (దేవదాస్-చంద్ర). ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బి(Wamika Gabbi) ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. నేడు ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా చిత్ర బృందం ‘బ్లడీ వాలెంటైన్’ పేరుతో ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ఉండే ‘వయొలెన్స్’ ఈ గ్లింప్స్‌లోనూ పీక్స్‌లో ఉంది.

లోకేష్ ఒక వ్యక్తి గొంతును క్రూరంగా కోయడం, రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ప్రవర్తించడం చూస్తుంటే ఆయనలోని కొత్త నటుడు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వామికా గబ్బి, లోకేష్ ఇద్దరూ గన్‌లతో కాల్పులు జరుపుతూ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ సంజనా కృష్ణమూర్తి (Sanjana Krishnamurthy)ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. గ్లింప్స్‌లో ఆమె ఒక వేశ్య పాత్రలో సిగరెట్ వెలిగిస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ‘DC’ సినిమాను ఈ సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



Next Story