- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరికీ బ్లాక్‌బస్టర్ థియేట్రికల్ అనుభవం గ్యారెంటీ.. ‘మోగ్లీ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala), సందీప్ రాజ్(Sandeep Raj) కాంబోలో ‘మోగ్లీ’ (Mowgli)మూవీ రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala), సందీప్ రాజ్(Sandeep Raj) కాంబోలో ‘మోగ్లీ’ (Mowgli)మూవీ రాబోతుంది. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మి్స్తున్నారు. అడవిలో సాగే సస్పెన్స్, యాక్షన్ భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ పలు సార్లు వాయిదా పడింది. ఎన్ని సార్లు రిలీజ్ తేదీలు ప్రకటించినప్పటికీ.. వెనకడుగు వేసింది.
తాజాగా, ‘మోగ్లీ’ విడుదలకు సిద్ధమైనట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. క్రిస్మస్ పండుగను, రజనీ కాంత్ బర్త్ డేను క్యాచ్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అలాగే మాస్‌కి, క్లాస్‌కి, యూత్‌కి నచ్చే లవ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా అందరికీ బ్లాక్‌బస్టర్ థియేట్రికల్ అనుభవం గ్యారెంటీగా. ఈ లవ్ స్టోరీ ఇవ్వబోతోందని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.






