బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్.. ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-21 04:35:34  IST  )

గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్, రీరిలీజ్‌ల హవా కొనసాగుతోంది.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్, రీరిలీజ్‌ల హవా కొనసాగుతోంది. గతంలో ప్రేక్షకులను మెప్పించలేని చిత్రాలు కూడా రీరిలీజ్‌లో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సీని కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘శివ’ (Shiva)సినిమాను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘నా ప్రియమైన తండ్రి ANR పుట్టిన రోజున, భారతీయ సినిమాను కదిలించిన సినిమా మళ్ళీ థియేటర్లను కదిలించడానికి తిరిగి వస్తోందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన పాత్ బ్రేకింగ్ ఫిలిమ్ ‘శివ’ నవంబర్ 14, 2025న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కాబోతుంది. పెద్ద స్క్రీన్‌లపై డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కల్ట్ క్లాసిక్ #SHIVA4Kని అనుభవించండి. అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు ఆర్జీవీ స్పందిస్తూ.. ‘‘శివ సినిమా పిల్లల మూవీ కాదు. కానీ చిల్ర్డన్స్ డే రోజు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం రీరిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చాలామంది మొహాలలో పిల్లల గ్లో కనిపిస్తుంది’’ అని రాసుకొచ్చారు. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story