- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్.. బంపర్ ఆఫర్ అందుకున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. ఇక గత ఏడాది మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’మూవీలో నటించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రావడంతో మీనాక్షి పాపులారిటీ ఊహించని విధంగా పెరిగింది. ఇక ఇటీవల మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం’ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ ప్రియురాలిగా నటించిన మీనాక్షి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అనతి కాలంలోనే ఊహించని ఫేమ్ సంపాదించుకున్న మీనాక్షి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈక్రమంలో.. తాజాగా, మీనాక్షి చౌదరి ఓ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రేజీ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు టాక్. ఈ చిత్రానికి అమరన్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియ స్వామి (Rajkumar Periya Swamy)దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్(Dhanush) కెరీర్‌లో రాబోతున్న 55వ మూవీ కావండంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. D-55 వర్కింగ్ టైటిల్ తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ షూట్‌లో మీనాక్షి కూడా పాల్గొనబోతున్నట్లు టాక్.
ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బంపర్ ఆఫర్ అందుకుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా మీనాక్షి ఉంటే.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. గత కొద్ది కాలంగా ధనుష్ వరుస హిట్స్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు నిర్మాతగా, దర్శకుడిగా నటుడిగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలతో పాటు నటించినవి కూడా విజయాలు సాధిస్తున్నాయి. ఇక ఇప్పుడు ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. అలాంటి హిట్ హీరో మూవీలో మీనాక్షి చాన్స్ అందుకోవడంతో అంతా సంతోషిస్తున్నారు. ‘D-55’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నెట్టింట హంగామా చేస్తున్నారు.






