- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా ప్రకటించిన బ్యూటీ.. ఆ కళ్ళు రహస్యాలను దాచిపెడుతున్నాయంటూ పోస్ట్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘ది రాజాసాబ్’ (The Rajasaab)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘ది రాజాసాబ్’ (The Rajasaab)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న క్రిస్మస్ కానుకగా రాబోతుంది. ఇదిలా ఉంటే.. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
కొత్త సినిమాను ప్రకటిస్తూ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. చీకటిలో ఉన్న కళ్లను షేర్ చేస్తూ ‘‘ఆమె కళ్ళు రహస్యాలను దాచిపెడుతున్నాయి. ఆమె ఉనికి చలిని తెస్తుంది. కానీ ముఖం కనిపించకుండానే ఉంది! ఈ దసరా, చీకటికి ఒక పేరు వస్తుంది. మా సినిమా టైటిల్ ప్రకటిస్తున్నాము వేచి ఉండండి’’ అని రాసుకొచ్చింది. ఈ చిత్రానికి నిఖిల్ కార్తీక్ (Nikhil Karthik) దర్శకత్వం వహిస్తుండగా .. జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్-1’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఈ సినిమాను పుప్పల అప్పలరాజు నిర్మిస్తున్నారు.






