‘బైకర్’ వాయిదా.. ఆ హీరో కోసం వెనక్కి తగ్గిన శర్వానంద్ కలిసొచ్చేనా!

by Mallepaka Hamsa |

టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా ‘బైకర్’(Biker) చిత్రం రాబోతుంది.

‘బైకర్’ వాయిదా.. ఆ హీరో కోసం వెనక్కి తగ్గిన శర్వానంద్ కలిసొచ్చేనా!
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా ‘బైకర్’(Biker) చిత్రం రాబోతుంది. అభిలాష్ కంకర(Abhilash Kankara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈక్రమంలో..తాజాగా, మూవీ మేకర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘బైకర్’ వాయిదా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 5న బాలకృష్ణ ‘అఖండ-2’ రిలీజ్ కాబోతుండటంతో ‘బైకర్’ మేకర్స్ కాస్త వెనక్కి తగ్గినట్లు టాక్. హిట్ కొట్టాలన్న కసితో ఉన్న శర్వానంద్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారం తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ఈ సారైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నిరాశ చెందుతున్నారు.

Next Story