- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ జర్నీ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల.. కంగ్రాట్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్
ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల(Kalyan Padala) సామాన్యుడిగా రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss-9) లో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల(Kalyan Padala) సామాన్యుడిగా రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss-9) లో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. సీజన్-9లో పాల్గొని ముందుగా టాస్కుల్లో పెద్దగా యాక్టివ్‌గా లేనప్పటికీ చివరి వారాల్లో తన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్‌గా మారి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇక ఈక్రమంలోనే తనూజతో క్లోజ్‌గా ఉండి.. తమ బంధాన్ని అంతా ప్రేమగా అనుకునేలా ప్రవర్తించాడు. అయితే ముందు నుంచి అన్ని టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండి ఆడపులిలా ఆడిన తనూజ గెలుస్తుందనుకుంటే.. ఊహించని విధంగా కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచాడు. తొలిసారి ఒక సామాన్యుడు గెలిచి చరిత్ర సృష్టించడమే కాక భారీగా ప్రైజ్‌మనీ తీసుకున్నాడు. ఇక బయటకు వచ్చాక ఎంతోమంది కళ్యాణ్ తన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఇక గెలుపును ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు.
తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఓ యూట్యూబ్ చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తనకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీ అందరితో మరింత సన్నిహితంగా కనెక్ట్ అవ్వడానికి, నా నిజమైన వ్యక్తిత్వాన్ని, నేను నేర్చుకున్న విషయాలను, సరదా క్షణాలను, వీటన్నింటి మధ్య జరిగే ప్రతి విషయాన్ని పంచుకోవడానికి నేను నా అధికారిక యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. మీ ప్రేమ నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. ఇప్పుడు నేను ఈ తదుపరి అడుగు వేస్తున్నప్పుడు నాకు మీ మద్దతు అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాతో పాటు ఉండండి.. మనం కలిసి ఎదుగుదాం. మరిన్ని అప్‌డేట్‌లు త్వరలోనే రాబోతున్నాయి’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన కళ్యాణ్ పడాల అభిమానులు కంగ్రాట్స్ అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.






