'Bigg Boss' నుంచి చలాకీ చంటి ఔట్!

by srinivas |
Bigg Boss నుంచి చలాకీ చంటి ఔట్!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 రసవత్తరంగా కొనసాగుతోంది. నాలుగో వారం అనూహ్యంగా ఆరోహీ ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదో వారం ఎలిమినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫైమా, బాలాదిత్యా, వాసంతి ఇనయ, చలాకీ చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనా ఎలిమినేషన్‌లో ఉండగా వీరిలో అందరికంటే ఎక్కువగా ఫైమాకు ఓట్లు వచ్చినట్లు సమాచారం. ఐదో వారం ఇంత మంది ఎలిమినేషన్‌లో ఉన్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం హోరాహోరీగా పడ్డాయి.

ఇనయాకు కూడా బాగానే పడ్డాయి కానీ గత వారం కంటే ఈ వారంలో ఓటింగ్‌లో వెనకబడిపోయింది. దీనికి కారణం ఆర్జే సూర్యకు క్లోజ్ కావటం అని తెలుస్తోంది. బాలాదిత్య, వాసంతి, చంటి, అర్జున్, మెరీనాలకు పోటాపోటీగా ఓట్లు పడ్డాయి. అయినా వీరు ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఓటింగ్‌లో మాత్రం చలాకీ చంటి అందరికంటే తక్కవ ఓట్లతో వెనకబడిపోయారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది చలాకీ చంటి అని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది ఎంత వరకు నిజం అనేది మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

Adipurush పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు

Next Story