3 నెలలకే గిన్నీస్‌తో పాటు ఐదు ప్రతిష్టాత్మక రికార్డులు సాధించిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

by Mallepaka Hamsa |

సోనియా-యష్ విరగోని దంపతుల గారాలపట్టి శిఖ, కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

3 నెలలకే గిన్నీస్‌తో పాటు ఐదు ప్రతిష్టాత్మక రికార్డులు సాధించిన  బిగ్‌బాస్ సోనియా కూతురు..
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం ఆమె ముద్దుల కూతురు శిఖ సాధించిన అరుదైన ఘనత. సాధారణంగా మూడు నెలల వయసున్న పిల్లలు ఇప్పుడిప్పుడే బోర్లా పడటం, కేరింతలు కొట్టడం నేర్చుకుంటారు. కానీ శిఖ మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డులనే తిరగరాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోనియా-యష్ విరగోని దంపతుల గారాలపట్టి శిఖ, కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అత్యంత చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. గిన్నిస్ రికార్డ్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా శిఖ పేరు నమోదైంది.తండ్రి అరచేతిపై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడటం అనే విభాగంలో శిఖ ఈ ఘనత సాధించింది. తన తండ్రి యష్ అరచేతిపై ఏకంగా 2 నిమిషాల 43 సెకన్ల పాటు నిలబడి అద్భుతమైన బ్యాలెన్సింగ్ స్కిల్స్ చూపించింది.

ఇంత చిన్న వయసులో కాళ్లు కూడా సరిగ్గా నిలకడగా ఉండని సమయంలో, శిఖ చూపించిన ఈ ఏకాగ్రత, శారీరక సామర్థ్యం చూసి రికార్డు సంస్థల ప్రతినిధులే విస్తుపోయారు. శిఖ చేసిన ఈ అద్భుతానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ చిన్నారి టాలెంట్ చూసి ఫిదా అయిపోతున్నారు. "వావ్.. సూపర్ శిఖ!, ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప టాలెంటా.. గ్రేట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకేసారి ఐదు రికార్డులు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన శిఖపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘనత సాధించిన కూతురిని చూసిన సోనియా దంపతులు గర్వపడడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శిఖ చేసిన రేర్ ఫీట్‌ను ఇంట్లో ప్రయత్నించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరి చిన్నారుల శరీరాలు ఓకేలా ఉండవు కాబట్టి సరైన గైడెన్స్ లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ప్రమాదకరమని అంటున్నారు.

Next Story