నన్ను తేడాగాడు అన్నారంటూ స్టేజి మీదనే ఏడ్చేసిన బిగ్‌బాస్ సోహెల్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్

by Hamsa |
నన్ను తేడాగాడు అన్నారంటూ స్టేజి మీదనే ఏడ్చేసిన బిగ్‌బాస్ సోహెల్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటుడు సోహెల్ పలు సిరియల్స్ ద్వారా పరిచయం అయ్యాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఆగస్టు 18న విడుదల కానుంది.

తాజాగా, సోహెల్ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోలో పాల్గొన్నాడు. తనకు లైఫ్‌లో ఎదురైన అనుభవాల గురించి చెప్తూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. ‘‘ ఇక్కడ లైఫ్ ముందుకు వెళ్లాలి. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో? వాడు రియాలిటీ షో నుండి వచ్చాడు. చిన్న స్క్రీన్ నుండి వచ్చాడు అంటూ చుట్టు పక్కల వాళ్లు అంటుంటే అప్పుడప్పుడు చాలా భయం వేసింది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా మంది హేళన చేశారు. తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టీజర్ వచ్చినప్పుడు ఏందిరా తేడాగాడిగా ఉన్నాడు’’ అంటూ చెప్పుకొస్తూ స్టేజి మీదనే ఏడ్చేశాడు.

Also Read: ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే..

Next Story

Most Viewed