- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు డేట్ ఫిక్స్.. ఈ సారి హౌస్‌మెట్స్ ప్రభుత్వమంటూ స్టార్ హీరో పోస్ట్
రియాలిటీ షో బిగ్‌బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ షో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చి పలు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ షో మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగులో ఇటీవల ఓ ప్రోమో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కామన్ పీపుల్‌ను కూడా సెలెక్ట్ చేయనున్నారు. తాజాగా,హిందీలోనూ బిగ్‌బాస్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
సీజన్ 19 రాబోతుండగా.. ఓ ప్రోమోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సల్మాన్ ఖాన్(Salman Khan) షేర్ చేశారు. ఈ సీజన్ జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. ఈ షో ఆగస్టు 24 నుంచి గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభం కానుంది. ఇక విడుదల అయిన ప్రొమోలో సల్మాన్ రాజకీయ నాయుకుడి గెటప్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్శించారు. ఈ పోస్ట్‌కు ఈసారి ఇది హౌస్‌మేట్స్ ప్రభుత్వం’’ అనే క్యాప్షన్ జత చేశారు. గత సీజన్ మూడున్నర నెలలు నడిపించగా.. ఈ సారి మొత్తం ఐదున్నర నెలల పాటు షో సాగనుందని సమాచారం.






