Bigg Boss House సీక్రెట్స్‌ను బయటపెట్టిన ప్రొడక్షన్ బాయ్.. (వీడియో)

by Disha Web Desk 7 |
Bigg Boss House సీక్రెట్స్‌ను బయటపెట్టిన  ప్రొడక్షన్ బాయ్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరో సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్మెంట్, గేమ్స్, ఓటింగ్ తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఫైనల్ వీక్‌కి దగ్గరపడుతున్న బిగ్‌బాస్-6 గురించి నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. బిగ్‌బాస్ హౌస్ హౌస్‌లో ప్రొడక్షన్ బాయ్‌గా చేస్తున్న వ్యక్తి హౌస్‌కి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాలు చెప్పాడు.

ప్రొడక్షన్ బాయ్ మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదంతా ఒక స్క్రిఫ్ట్ రూపంలో జరుగుతుంది. మీకు బయటకు కనిపించేది ఒకటి ఉంటే.. లోపల మరొకటి జరుగుతుంది. మీకు మేన్ డోర్ ఒకటే కనపడుతుంది.. కానీ చుట్టూ 15,20 డోర్లు వరకు ఉంటాయి. మేము లోపలికి పోయి వాళ్లకు కావాల్సినవి ఇస్తూనే ఉంటాం అవన్నీ మీకు చూపించరు. రియాల్టీ షో కాబట్టి రియాల్టీ షో లా మాత్రమే మీకు చూపిస్తారు. అన్నీ ఫేక్ ఎలిమినేషన్లే జరుగుతున్నాయి.. అది ఓట్లు వేసిన వాళ్లకు కూడా అర్దం అయ్యో ఉంటుంది. రెండు రోజుల ముందే ఒక స్క్రిప్ట్ రూపంలో ఎలిమినేట్ చేసేసి ఓ సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆది రెడ్డి ఇప్పటికే ఎలిమినేట్ కావాలి.. కానీ ఓ కామెన్ మెన్‌గా వచ్చిన వాడిని అప్పుడే తీసేకూడదని ఉంచారు. అంత ఎందుకు ఈ సీజన్ రేవంత్ విన్ అవుతాడు అది కూడా ఫిక్స్ అయిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read....

రెండు నెలల్లో Prabhas పెళ్లి..! షాకింగ్ న్యూస్ లీక్ చేసిన Ram Charan

Next Story