‘సలార్’ అర్థం కాలేదంటూ బిగ్‌బాస్ గీతూ పోస్ట్.. ఆడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
‘సలార్’ అర్థం కాలేదంటూ బిగ్‌బాస్ గీతూ పోస్ట్.. ఆడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ మాస్ జాతర చూడడానికి ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే సలార్‌పై ఇప్పటికే చాలా మంది ప్రశంసలు కురిపించారు. తాజాగా, బిగ్‌బాస్ గీతూ రాయల్ సలార్ రివ్యూ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. ‘‘నేను.. సలార్ బెనిఫిట్ షో చూశా.. చాలామంది ఎట్లుంది ఎట్లుంది అని అడుగుతున్నారు. ఈ సినిమా చూడకముందు ఫ్లాప్ అనుకున్నా.. సలార్ కూడా ఫ్లాపేలే అని అనిపించింది. కానీ సినిమా అయితే అద్దిరిపోయింది. ఆ స్టోరీ కానీ.. ఆ ట్విస్ట్‌లు కానీ.. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌లు కానీ భయంకరంగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం చూస్తే సినిమా ఏం అర్థం కాదు.

ఎందుకంటే చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి.. ఆ ఫ్లాట్.. డైలాగ్‌లూ ఎందుకు చెప్తున్నారో కూడా అర్ధం కాదు. సెకండ్ టైం చూస్తే అర్ధం అవుతుంది. ఫస్ట్ చూసిన వాళ్లకి అంత తొందరగా ఎక్కదు. నాకంత బుర్ర లేదేమో అందుకే నాకు అర్థం కాలేదు. కానీ స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది. ప్రభాస్ కటౌట్ అయితే ఓ మై గాడ్ అనేట్టుగానే ఉంది. కటౌట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనేట్టుగానే ఉన్నాడు. పోయిన సినిమాలు చూస్తే.. ప్రభాస్ అందం పోయిందే అనిపించింది. ఆ అందం సలార్ సినిమాతో తిరిగి వచ్చింది. ఈ సినిమా రెండు సార్లు చూడాల్సిందే.. ఫస్ట్ టైం చూస్తే మాత్రం అర్థం కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ గీతూను ఆడేసుకుంటున్నారు.

Next Story

Most Viewed