తల్లి కాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బుల్లితెర నటి సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా, నటిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

తల్లి కాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బుల్లితెర నటి సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా, నటిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. 8వ సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లిన ఆ మె కొద్ది రోజులపాటు ప్రేక్షకులను అలరించింది. పలు టాస్క్ లో పాల్గొని ఇతరులకు గట్టిపోటీ నిచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ విన్నర్ కాలేకపోయింది. కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఈక్రమంలోనే తన ప్రియుడు యశ్ వీర్ గ్రోవి(Yash Veer Groovy)తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే పెద్దలను ఒప్పించి నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. నెలరోజుల్లోనే యష్‌తో ఏడడుగులు వేసింది. ఆ తర్వాత ఓంకార్ షోలో పాల్గొన్న సోనియా జంట పలు గేమ్స్ ఆడటంతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

కానీ విన్నర్ కాలేక మధ్యలోనే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయిన సోనియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు పెడుతోంది. ఈక్రమంలో.. తాజాగా, సోనియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను ప్రెగ్నెంట్ అయినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసి తన భర్తను సర్‌ప్రైజ్ చేసింది ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని మరి భర్త ఆఫీసుకి వెళ్లిన ఆమె యశ్‌వీర్‌కు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఈ శుభవార్తను తెలుసుకున్న ఆయన తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అని కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story