బాయ్ ఫ్రెండ్‌తో హాట్ ఫొటోషూట్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ పోజులేంటమ్మా తల్లీ అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

by Kavitha |
బాయ్ ఫ్రెండ్‌తో హాట్ ఫొటోషూట్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ పోజులేంటమ్మా తల్లీ అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. అలా వచ్చిన ఈమె పలు సినిమాల్లో నటించింది. కానీ అనుకున్నంత ఫేమ్ రాలేదు. కానీ, బిగ్ బాస్ సీజన్ సిక్స్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అలా అక్కడ రేవంత్, శ్రీహాన్‌లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానా.. బయట ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్‌గా నిలుస్తోంది. తరచూ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. అయితే తాజాగా ఇనయా తన ప్రేమాయణాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. జిమ్ ట్రైనర్ గౌతమ్‌ తాను లవ్‌లో ఉన్నట్లుగా ఇనయా తెలిపింది. ఇక అప్పటి నుంచి వీరు సోషల్ మీడియాలో తమ డేటింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా బిగ్​బాస్ ఫేమ్ ఇనాయా తన బాయ్​ అయిన గౌతమ్ చక్రధర్​తో హాట్​ ఫోటో షూట్ చేసింది. అంతేకాకుండా వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఇద్దరూ ఇంటిమసీ లుక్స్​లో చూసుకుంటూ.. ఫొటోలకు పోజులిచ్చారు. అలాగే ఈ పిక్స్‌ను బ్లాక్​ అండ్ వైట్ చేసి తన ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ ఓ సాంగ్ లిరిక్స్​ని క్యాప్షన్​గా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు మాత్రం ఓ రేంజ్​లో కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ పోజులేంటమ్మ తల్లీ అని.. అలాగే వేణు స్వామిని కలిసి నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

శ్రీలీల, మంగ్లీ మధ్యలో నలిగిపోయిన డైరెక్టర్ అనుదీప్.. సుప్పినీ సుద్దపూసనీ అంటున్న నెటిజన్లు (వీడియో)

(video link credits to doulath sulthana instagram id)

Advertisement

Next Story

Most Viewed