- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన పదేళ్లకు తల్లి కాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
శివ జ్యోతి(Shiva Jyoti) తిన్నార్ వార్తలతో సావిత్రిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దిశ, సినిమా: శివ జ్యోతి(Shiva Jyoti) తిన్నార్ వార్తలతో సావిత్రిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక కొద్ది కాలం తర్వాత వార్తలకు దూరం అయి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. పలు టాస్కులతో పాటు ప్రతి విషయానికి ఎమోషనల్ అయి ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయింది.ఒక షో నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తోంది. అయితే గత కొద్ది కాలంగా శివజ్యోతి తల్లి కాబోతున్నట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈక్రమంలో.. తాజాగా,శివజ్యోతి దసరా పండుగ సందర్భంగా ఈ విషయంపై స్పందిస్తూ శుభవార్త చెప్పింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం వెయిట్ చేసిండ్రో.. మీరు – నాకు కావలిసినవాళ్లు. వాళ్ల సొంత అక్క బావ కి బేబీ రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు. ఇట్ల బిడ్డ వస్తుంది అని చెప్పగానే.. మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే సంతోషంగా ఫీల్ అయితరు అనుకుంటున్నా.
అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట. ప్లీజ్ దిష్టి పెట్టకండి.. ఆశీర్వాదాలు ఇవ్వండి. దిష్టి కన్నా ఆశీర్వాదాలు గొప్పవి అని ప్రూవ్ చేద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు సపోర్ట్ చేసినోళ్లను. సపోర్టుగా ఉన్నళ్లోను జీవితకాలం మర్చిపోను. మేము మీకు ప్రమాణం చేస్తున్నాము.. మీకు మేము ఎప్పటికీ అండగా ఉంటాము. బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను .. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి నాకు, మా ఫ్యామిలీకి, స్పెషల్‌గా మాకు పుట్టబోయే బిడ్డకు’’ అని రాసుకొచ్చింది. దీంతో అది నెటిజన్లు సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.






