బిగ్‌బాస్ బ్యూటీ బర్త్ డే స్పెషల్.. నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెట్టింట ప్రశంసల వర్షం

by Mallepaka Hamsa |

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయోన్సర్ శుభశ్రీ (Subhashree Rayaguru) బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

బిగ్‌బాస్ బ్యూటీ బర్త్ డే స్పెషల్.. నెటిజన్లకు బంపర్ ఆఫర్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెట్టింట ప్రశంసల వర్షం
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయోన్సర్ శుభశ్రీ (((Subhashree Rayaguru)బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. బిగ్‌బాస్ సీజన్-7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బామ తన గ్లామర్ షోతో మరింత ఫేమ్ సంపాదించుకుంది. కానీ విన్నర్ కాలేకపోయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసిన శుభశ్రీ ఊహించినంత క్రేజ్‌ను దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటై తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇక ఇటీవల ఈ అమ్మడు గుడ్ న్యూస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సినీ నిర్మాత అజయ్ మైసూర్‌(Ajay Mysore)తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వీరిద్దరు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేససుకున్నారు. ఇక ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకుంటుందని ట్రోల్స్ చేశారు. ఇంత అందమైన అమ్మాయి నల్లగా ఉన్నవాడిని డబ్బు కోసమే చేసుకుంటుందని దారుణంగా విమర్శించారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన శుభశ్రీ తనదైన స్టైల్లో ట్రోల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శుభశ్రీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. జూలై 15న తన పుట్టినరోజు కావడంతో మంచి పనికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. కాబోయే భర్తతో కలిసి ఓ వీడియో చేసింది. లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నాము.

మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి.. మేము మీరు సాయం చేస్తాము. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్ చేసి వారికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ఈసారి మీ అందరికీ చిన్న ధన్యవాదాలు. దయచేసి మీ పరిస్థితి, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాకు చెప్పండి, వ్యాఖ్యలు లేదా DM ద్వారా మాకు తెలియజేయండి మరియు మేము జూలై 15, ఉదయం 10 గంటలకు Instagramలో ప్రత్యక్షంగా విరాళం ఇస్తాము’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శుభశ్రీ, అజయ్‌ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story