- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బాస్-9: అగ్నిపరీక్షలో ఊహించని ట్విస్ట్.. 15మందిలో ఆ ఇద్దరికి ఎల్లో కార్డ్ ఇచ్చిన జడ్జెస్ (వీడియో)
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ త్వరలో 9వ (Bigg Boss-9)సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ త్వరలో 9వ (Bigg Boss-9)సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్న ఈ షో సెప్టెంబర్ 7న ప్రారంభం కాబోతుంది. ఇక ఇందులో సెలబ్రిటీలతో పాటు 5మంది సామన్యులు కూడా హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. దీంతో బిగ్‌బాస్ టీమ్ గత కొద్ది రోజుల క్రితమే అగ్నిపరీక్ష పేరుతో ఓ షోను స్టార్ట్ చేశారు. ఇందులో ఓ 15మంది సామాన్యులను టాస్కులు పెట్టి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ షోలో అభిజత్ నవదీప్, బిందు మాధవి జడ్జెస్‌గా వ్యవరిస్తుండగా.. శ్రీముఖి యాంకర్‌గా చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ షో ప్రసారం కావాల్సి ఉండగా.. ఇంకా కంటెస్టెంట్ల ఎంపికమై తర్జనభర్జన పడుతున్నారు.
తాజాగా, జరిగిన అగ్నిపరీక్ష(agni pariksha) ఎపిసోడ్‌తో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 15మంది సమాన్యులకు టాస్కులు పెట్టిన జడ్జెస్.. సరిగ్గా ఫర్ఫామెన్స్ ఇవ్వని ఇద్దరికి ఎల్లో కార్డు ఇచ్చారు. ప్రసన్న కుమార్, శ్వేత (swetha) సరిగ్గా టాక్స్ ఆడలేదని ఎలిమినేట్ చేశారు. దీంతో ప్రసన్న కుమార్(Prasanna Kumar) కన్నీరు పెట్టుకున్నాడు. అది చూసిన జడ్జెస్ ఆయనకు మోటివేట్ చేసి బయటకు పంపేశారు. దీంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రొమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మిగిలిని 13 మందిలో టీమ్ కేవలం ఐదుగురిని మాత్రమే హౌస్‌లోకి పంపబోతున్నారు.






