బిగ్‌బాస్-9: అందరూ ఆ ఇద్దరు సెలబ్రిటీలనే టార్గెట్.. మూడో వారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్..!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-23 03:35:22  IST  )

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 హోరా హోరీగా కొనసాగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బిగ్‌బాస్-9: అందరూ ఆ ఇద్దరు సెలబ్రిటీలనే టార్గెట్.. మూడో వారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్..!
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 హోరా హోరీగా కొనసాగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇందులో 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. ఇందులో 9 మంది సెలబ్రిటీలు ఉండగా.. 6 మంది కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు. ఇక ఇందులో మొదటి వారం ఎలిమినేట్ అయిన శ్రేష్టి వర్మ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. హౌస్‌లోకి చివరగా వెళ్లిన కామనర్ మర్యాద మనీష్ రెండోవారం ఎలిమినేట్ అయిపోయాడు. మూడో వారంలోకి అడుగు పెట్టిన ఈ షోలో నామినేషన్స్ జరిగాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్‌ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్‌ అయుండాలని కండిషన్ పెట్టాడు. దీంతో హరీశ్‌, ప్రియ, శ్రీజ సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్‌, ఫ్లోరాను నామినేట్‌ చేశారు. చివరకు టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో నిలబెట్టారు. ఇక ఈ సారి నామినేషన్స్ ఎక్కువమంది సంజనా బిహేవియర్ బాలేదని అన్నారు. అలాగే రీతూ శ్రీజపై ఫైర్ అయింది. నీ అవసరం లేకపోయినా అరుస్తున్నావంటూ రీతూ విశ్వరూపం బయటపెట్టింది. అలాగే రీతూ చౌదరితో హరీష్ గొడవ పెట్టుకున్నాడు. కావాలనే అందరినీ నామినేషన్స్‌లో ఉంచారని ఆమెతో వాదనకు దిగాడు. దీంతో ఆమె ఏడ్చేసింది. ఇక పంచాయతీలు అన్ని ముగిసాక.. ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. హరిత హరీష్, ప్రియా, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రామ్ రాథోడ్ ఉన్నారు.

Next Story