Bigg Boss-9: బంపర్ ఆఫర్ అందుకున్న కన్నడ బ్యూటీ.. కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఖాయం అయిపోయిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-26 05:36:16  IST  )

ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. 9వ సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss-9: బంపర్ ఆఫర్ అందుకున్న కన్నడ బ్యూటీ.. కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఖాయం అయిపోయిందిగా!
X

దిశ, సినిమా: ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. 9వ సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఈ షోలో ఈ సారి సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 5న ప్రారంభం కాబోతున్న ఈ షోకు.. వెళ్లేందుకు సామాన్యులు తెగ కష్టపడుతున్నారు. కొద్ది రోజులుగా అగ్ని పరీక్ష అనే పేరుతో రాబోతున్న షోలో సెలెక్షన్స్ పేరుతో జరుగుతున్న టాస్కుల్లో పాల్గొంటున్నారు. ఈ షోలో శ్రీముఖి(Srimukhi), యాంకర్‌గా వ్యవహరిస్తుండగా.. బింధు మాధవి(Bindhu Madhavi), నవదీప్(Navdeep), అభిజిత్ జడ్జెస్‌గా చేస్తున్నారు.

ఈ షో అంతా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కన్నడ బ్యూటీ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముద్దమందారం సీరియల్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న తనుజా గౌడ(Tanuja Gowda) ఎంట్రీ దాదాపు ఖాయం అయినట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బిగ్‌బాస్ టీమ్‌పై విమర్శలు చేస్తున్నారు. కాగా, తనూజ ముద్దమందారంతో పాటు పలు చిత్రాల్లోనూ నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగభైరవి సీరియల్‌తో పాటు పలు షోస్‌లోనూ పాల్గొని సందడి చేసింది. అలాగే ఆమె బుల్లితెర హీరో పవన్‌తో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కూడా వచ్చాయి. ఈక్రమంలోనే తనూజ స్పందించి క్లారిటీ ఇచ్చింది. తను మంచి ఫ్రెండ్ అని చెప్పింది.

Next Story