- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: ఐదేళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన ‘బిగ్‌బాస్-9’.. మరచిపోలేని క్షణాలంటూ నాగార్జున ఎమోషనల్ పోస్ట్
రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో ఊహించని ఆదరణను సొంతం చేసుకోవడంతో కాకుండా టీఆర్పీ రేటింగ్ కూడా అత్యధికంగా సాధించింది.

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో ఊహించని ఆదరణను సొంతం చేసుకోవడంతో కాకుండా టీఆర్పీ రేటింగ్ కూడా అత్యధికంగా సాధించింది. గత ఏడాది డిసెంబర్‌లో సీజన్-9 ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో కామనర్ కళ్యాణ్ పడాల తెలుగు సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. చివరి నిమిషంలో.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి ట్రోఫీతో పాటు క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మొదటి నుంచి గేమ్స్ బాగా ఆడిన తనూజ విన్నర్‌గా నిలుస్తుందని అంతా భావించగా.. చివరకు రన్నరప్‌గా నిలిచింది. తాజాగా, ప్రేక్షకులను అలరించిన ఈ షో అరుదైన రికార్డ్ సాధించినట్లు అక్కినేని నాగార్జున (Nagarjuna)ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
గత ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించి గత ఐదేళ్ల రికార్డు బ్రేక్ చేసింది. ఇదే అతి పెద్ద రికార్డ్ అంటూ ఎమోషనల్ అయ్యారు. ‘‘బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గత 5 సంవత్సరాలలోనే అతిపెద్దదిగా నిలిచింది. భావోద్వేగాలు, ఉత్సాహం, సంఘర్షణలు మరచిపోలేని క్షణాలతో నిండిన సీజన్ ఇది. స్టార్ మాలో 19.6 రేటింగ్స్ సాధించడంతో పాటు జియోస్టార్‌లో 285 మిలియన్ నిమిషాలు పాటు వీక్షించారు.అన్నింటికంటే ముఖ్యంగా, తమ ప్రేమ అచంచలమైన మద్దతుతో ఈ సీజన్‌ను నిజంగా చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ బిగ్‌బాస్ సీజన్-9 బ్లాస్ట్ చేసిందని అన్నారు.






