బిగ్ బాస్‌లోకి షకీలా.. 23ఏళ్ల పేరు బోల్డ్ బ్రాండ్ చెరిగిపోతుందా..?

by Kodari Anjali |   (  Updated:2023-09-04 09:21:39  IST  )

తెరమీద చూసిన షకీలా వేరు.. నిజ జీవితంలో చూస్తున్న షకీలా వేరు.. అని ప్రేక్షకులకు పరిచయం చేశాడు కింగ్ నాగార్జున.

బిగ్ బాస్‌లోకి షకీలా.. 23ఏళ్ల పేరు బోల్డ్ బ్రాండ్ చెరిగిపోతుందా..?
X

దిశ, సినిమా: తెరమీద చూసిన షకీలా వేరు.. నిజ జీవితంలో చూస్తున్న షకీలా వేరు.. అని ప్రేక్షకులకు పరిచయం చేశాడు కింగ్ నాగార్జున. తన లైఫ్‌లో అన్నీ కష్టాలేనని.. తనను కుటుంబం బంగారు గుడ్డులా వాడుకుందని చెప్పిన షకీలా.. తన డబ్బులు యూజ్ చేసుకున్న అక్క ఇప్పుడు బాగా సెటిల్ అయిందని చెప్పింది. కానీ తనకు ఒక గూడు లేకుండా చేశారని బాధపడింది. మరో వైపు తన సినిమా రిలీజ్ అయితే.. మిగతా హీరోల చిత్రాలకు జనాలు రావట్లేదని అడ్డుకున్నారని.. దీంతో తానే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నానని తెలిపింది. నాలుగేళ్ల తర్వాత తేజ డైరెక్షన్‌లో మళ్లీ తెరమీదకు వచ్చినట్లు చెప్పింది. అంతేకాదు పలువురు ట్రాన్స్‌‌జెండర్లకు తల్లిగా మారిన కథను కూడా వివరించింది.

Next Story