- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
800 చీరలు.. 50కిలోల జ్యువెల్లరీ.. వెండి వస్తువులు.. బాత్రూమ్‌లో కూడా.. బిగ్ బాస్‌లో క్రేజీ స్టఫ్‌తో వయ్యారి భామ
రియాలిటీ షో బిగ్ బాస్.. కొందరికి పాజిటివ్‌గా మారితే.. ఇంకొందరికి నెగెటివ్ అయిపోతుంది. కొందరు ఇంతకు ముందున్న పేరును చెడగొట్టుకుంటే.. ఇంకొందరు మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. ఇక హిందీ బిగ్ బాస్ 19వ సీజన్‌లోని పార్టిసిపెంట్స్‌లో సోషల్

దిశ, వెబ్ డెస్క్ : రియాలిటీ షో బిగ్ బాస్.. కొందరికి పాజిటివ్‌గా మారితే.. ఇంకొందరికి నెగెటివ్ అయిపోతుంది. కొందరు ఇంతకు ముందున్న పేరును చెడగొట్టుకుంటే.. ఇంకొందరు మంచి పాపులారిటీ దక్కించుకుంటారు. ఇక హిందీ బిగ్ బాస్ 19వ సీజన్‌లోని పార్టిసిపెంట్స్‌లో సోషల్ యాక్టివిస్ట్, టెడ్ఎక్స్ మోటివేషనల్ స్పీకర్, ఇన్‌ఫ్లుయెన్సర్ తాన్యా మిట్టల్.. చీరల్లో ఎక్స్‌పోజ్ చేసి.. బయట బోలెడు మంది ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. చీరనే ఆయుధంగా మార్చుకుని సోషల్ మీడియా ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. మరి అలాంటి శారీ లవర్.. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది.. మొత్తం చీరల గోలనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదే జరిగిందని తెలుస్తోంది.
తాన్యా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు.. ఏకంగా 800 చీరలు, 50 కిలోల ఆభరణాలు, వెండి వస్తువులు తీసుకుని వెళ్లిందట. రోజుకు మూడు చీరలు కట్టి కుర్రాళ్లను తనవైపు తిప్పుకునే ప్లాన్ చేసిందట. తద్వారా ఓటు బ్యాంక్ పెంచాలనేది ఆమె ఐడియా. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో ఓ డిస్కషన్ రాగా ఈవెన్ బాత్రూమ్‌లో కూడా తను చీరనే వినియోగిస్తానని, ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కానీ ఆమె ఓ విలేజ్‌ను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడుతుందని.. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.






