- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అఖండ-2’ నుంచి బిగ్ అప్డేట్ విడుదల.. జనని పాత్రలో యంగ్ బ్యూటీ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
నందమూరి బాలకృష్ణ(Balakrishna), జోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘అఖండ-2’.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘అఖండ-2’. ఈ సినిమాను 14రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇక ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అంతేకాకుండా భారీ అంచనాలను పెంచాయి. దీంతో ఈ చిత్రం అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘అఖండ-2’ నుంచి అప్డేట్ ఇస్తూ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ఆమె పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో ‘భజరంగ బాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా(Harshaali Malhotra) ‘జనని’ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు తెలిపారు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో ఎల్లో, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న లెహంగా ధరించి నగలతో హర్షాలీ మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అసలు ఆమె ఇందులో ఏ పాత్రలో నటిస్తుందా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.






