- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ పండుగ నాడే సర్‌ప్రైజ్ రాబోతుందంటూ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేనీ, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ టైటిల్ పెట్టే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలైనప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ అంచాలను పెంచుతున్నాయి. తాజాగా, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అక్టోబర్ 2న దసరా పండుగ నాడు అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.






