- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వార్-2’ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. హింసాత్మక ట్రైలర్‌గా నిలవనుందంటూ హైప్ పెంచుతున్న ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హోలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘వార్-2’(War-2).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హోలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘వార్-2’(War-2). అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‌గా రాబోతుండటం విశేషం. యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా యష్‌రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘వార్-2’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘వార్-2’ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 2 నిమిషాల 39 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ ట్రైలర్‌ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు. అయితే ఇది హింసాత్మక ట్రైలర్‌గా నిలవనుందంటూ ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. దీంతో ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






