‘ఏ ఊరికి వెళ్ళినా.. ఏ బీట్ కొట్టినా.. మన హార్ట్ బీట్ మాత్రం గల్లీ స్టెప్’.. ‘ఓ భామ అయ్యో రామ’ బిగ్ అప్డేట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో సుహాస్ (suhas)విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

‘ఏ ఊరికి వెళ్ళినా.. ఏ బీట్ కొట్టినా.. మన హార్ట్ బీట్ మాత్రం గల్లీ స్టెప్’.. ‘ఓ భామ అయ్యో రామ’ బిగ్ అప్డేట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుహాస్ (suhas)విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కలర్ ఫొటో, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ వంటి హిట్స్ అందుకున్న ఆయన తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ(’Oh Bhama Ayyo Rama). రామ్ గోధల (Ram Godala)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్(Malavika Manoj) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ మూవీని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది.

ఇప్పటికే ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాకు సంబంధించిన పోస్టర్, సాంగ్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన మాస్ అప్డేట్‌ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. ‘ఓ భామ అయ్యో రామ’ మాస్ సాంగ్ గల్లీ స్టెప్ జూన్ 27న రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సుహాస్ మాస్ స్టెప్ వేస్తున్న పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు. ఇక ఈ పోస్ట్‌కు.. ‘‘ఏ ఊరికి వెళ్ళినా... ఏ బీట్ కొట్టినా... మన హార్ట్ బీట్ మాత్రం గల్లీ స్టెప్’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

link

Next Story