‘శబ్దం’ నుంచి మరో అప్‌డేట్.. కీలక పాత్రలో సీనియర్ నటి

by Vinod kumar |

ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘శబ్దం’. 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం నుంచి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

‘శబ్దం’ నుంచి మరో అప్‌డేట్.. కీలక పాత్రలో సీనియర్ నటి
X

దిశ, సినిమా: ఆది పినిశెట్టి, అరివళగన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘శబ్దం’. 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం నుంచి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే కథానాయికగా లక్ష్మీ మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా సీనియర్ హీరోయిన్ లైలా కూడా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు ఇందులో మునుపెన్నడూ చేయని పాత్రలో లైలా కనిపించబోతుందన్న దర్శకనిర్మాతలు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను రూపొందిస్తామన్నారు. ఇక ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పనిచేస్తున్న మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Next Story