మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్‌ వచ్చేది అప్పుడే!

by Disha Web Desk 6 |
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్‌ వచ్చేది అప్పుడే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఫ్యాన్స్‌కు అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. గుంటూర్ కారం అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మ్మాడ్ సినిమా ఈవెంట్‌కు హాజరైన గుంటూరు కారం నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

గుంటూరు కారం మొదటి పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్వశ్చన్ ఎదురైంది. దానికి ‘‘ ఇంకా డేట్ ఏమీ అనుకోలేదు. దసరా ముందైతే ఇస్తాం’’ అని నాగవంశీ చెప్పుకొచ్చాడు. రాజమౌళి సినిమాల కంటే గుంటూరు కారం ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందని గతంలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారా అనే ప్రశ్న కూడా నాగవంశీకి ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. ‘‘కచ్చితంగా.. మాకు ఏం డౌట్ లేదు. జనవరి 12న థియేటర్లలో చూసి మీరే సాయంత్రం చెప్తారు’’ అని నాగవంశీ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed