వార‌ణాసి కోసం మ‌హేష్ భారీ రిస్క్..ఏకంగా నెల రోజుల పాటు న‌ర‌క‌మే !

by velandi.Saikiran |

వార‌ణాసి సినిమా షూటింగ్ లో భాగంగా వచ్చే నెల మొదటి వారం నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందట.

వార‌ణాసి కోసం మ‌హేష్ భారీ రిస్క్..ఏకంగా నెల రోజుల పాటు న‌ర‌క‌మే !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ మూవీ.. టైం ట్రావెల్, మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శివ భక్తుడి పాత్రలో మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ కాగా, అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం శ‌రావేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇలాంటి క్రమంలో ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా వచ్చే నెల మొదటి వారం నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందట. ఈ 30 రోజుల పాటు నాన్ స్టాప్ గా యాక్షన్స్ షూట్ జరగనున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రతిరోజు మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు సమాచారం. అంటే ఈ నెల రోజుల పాటు మహేష్ బాబు యాక్షన్ మోడ్ లో ఉంటాడన్నమాట. ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని కూడా అంటున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Next Story