- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ విడుదలపై బిగ్ ట్విస్ట్.. మేకర్స్ పోస్ట్‌తో సినీ ప్రియులు షాక్
యంగ్ హీరో మౌళి, శివాని నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts).

దిశ, సినిమా: యంగ్ హీరో మౌళి, శివాని నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ సినీ సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రాబోతుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో.. ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్పందించారు. ‘‘లిటిల్ హార్ట్స్ ఓటీటీ రైట్స్ మన వద్ద ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే ప్రసక్తి లేదు. అస్సలు ఇలా జరుగుతుందని ఊహించకండి. మన సినిమా ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ గా నడుస్తోంది. ఇలా నకిలీ చిత్రాలు స్ప్రెడ్ చేస్తే మీ ఫోన్ మీద ఓట్టే’’ అని ఓ పోస్ట్ పెట్టారు. దీంతో సినీ ప్రియులు అయోమయంలో పడిపోయారు.






