- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓజీ’లో బిగ్ సర్‌ప్రైజ్.. హాట్ బ్యూటీ ఎంట్రీతో బాక్సాఫీసు షేక్ అవ్వాల్సిందే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ‘ఓజీ’(OG) గత వారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ‘ఓజీ’(OG) గత వారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సుజిత్(Sujith) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై అన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణను రాబట్టుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటూ సరికొత్త రికార్డులు సాధిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘ఓజీ’ సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ జాయిన్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty)చేసిన స్పెషల్ సాంగ్ ‘‘కిస్ కిస్..బ్యాంగ్ బ్యాంగ్’’ పాటను థియేటర్స్‌లో యాడ్ చేశారు.
సెప్టెంబర్ 30 నుంచి ఈ కొత్త సాంగ్ కథలో ఓజీ గాయపడిన సందర్భంలో ఓమీ గ్యాంగ్ సెటబ్రేట్ చేసే సన్నివేశంలో ప్లేస్ చేయబడినట్లు సమాచారం. ఇక నేహాశెట్టి ఎంట్రీతో ప్రేక్షకుల్లో మరింతం జోష్ నెలకొంది. గబ్బర్ సింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ.. థియేటర్స్‌లో పవన్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. నేహా శెట్టి మొత్తానికి ‘ఓజీ’తో తన పాపులారిటీ డబుల్ చేయసుకోనున్నట్లు తెలుస్తోంది. అమ్మడు సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నట్లు టాక్. ఇక ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. మూవీ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.






