‘పెద్ది’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ఫస్ట్ సింగిల్ ‘చికిరి.. చికిరి’ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 16:03:43  IST  )

మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.

‘పెద్ది’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. ఫస్ట్ సింగిల్ ‘చికిరి.. చికిరి’ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్, మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ‘పెద్ది’ మూవీ టీమ్ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్‌ సర్‌ప్రైజ్‌గా వచ్చిన ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్‌తో రామ్ చరణ్ ఎనర్జీతో ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. మ్ చరణ్ తన సిగ్నేచర్ స్టెప్పుతో ఆకట్టుకున్నారు. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటను మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ లిరిక్స్ రాశారు. అయితే పూర్తి పాట నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

కాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor)జంటగా నటిస్తున్న ఈ చిత్రం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రొడక్షన్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, అర్జున్ అంబటి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల శ్రీలంకలో షూటింగ్ జరుపుకోగా.. షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్‌లోని ‘పెద్ది’లోని పలు సీన్స్ చీత్రీకరిస్తున్నారు. 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story