పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ విడుదలపై అప్డేట్..

by Disha Web Desk 6 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ విడుదలపై అప్డేట్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో హరిహర వీరమల్లు సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలై చాలా రోజులవుతుంది. అయితే హరిహర వీరమల్లు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్నప్పటికీ దీనికి సంబంధించిన పోస్టర్స్ తప్ప మరే అప్డేట్ రాలేదు. దీంతో సినిమా ఆగిపోతుందని పుకార్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఒక పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పుకార్లకు బలం చేకూరినట్లైయింది. అప్పటి నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రాలేదు.

తాజాగా, నేడు శ్రీరామ నవమి పండుగ కావడంతో మేకర్స్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హరిహరి వీరమల్లు టీజర్ తొందరలో రీలీజ్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందులో పవన్ కళ్లూ కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి ‘‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో’’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలంలో విడుదల కానుంది.


Next Story

Most Viewed