బిగ్ సర్‌ప్రైజ్.. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Mallepaka Hamsa |

రాజ్ తరుణ్(Raj Tarun), రాశి సింగ్ (Rashi Singh)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పాంచ్ మినార్’(Panch Minar).

బిగ్ సర్‌ప్రైజ్.. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: రాజ్ తరుణ్(Raj Tarun), రాశి సింగ్ (Rashi Singh)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పాంచ్ మినార్’(Panch Minar). రామ్ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇదో చిన్న రొటీన్ స్టోరీనే. కానీ చూస్తున్నంత సేపు నవ్వించేలా ఉంటుంది. ఉద్యోగానికి బదులు ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే ఓ యువకుడు ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకున్నాడు, ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు అన్నదే ఈ చిత్రం కథ. ఇందులో కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించారు. అయితే ఈ సినిమా నవంబర్ 21న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. కానీ హిట్ కాలేకపోయింది. ఐఎండీబీలోనూ 9.3 రేటింగ్ సాధించినప్పటికీ వారం రోజుల్లోనే ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయాలన్న మేకర్స్ నిర్ణయించుకున్నారట.

ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడంతో సినీ ప్రియులు సంతోష పడుతున్నారు. కాగా.. రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా ఆయన నిత్యం పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

రాజ్, లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేసినట్లు కేసు పెట్టడంతో ఈ వివాదం కాస్త కోర్ట్ వరకు వెళ్లింది. ఇక్కడ ఆయనకు కాస్త ఊరట లభించింది. దీంతో కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ సినిమాల విషయంలో మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. అయితే అందుకు కారణం పర్సనల్ లైఫ్‌లో జరిగిన వివాదామే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story