రష్మికకు బిగ్ షాక్.. మరో బోల్డ్ వీడియో రిలీజ్

by Hamsa |
రష్మికకు బిగ్ షాక్.. మరో బోల్డ్ వీడియో రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోకు ఏఐ సహాయంతో రష్మిక ఫేస్ సెట్ చేసి కొందరు వైరల్ చేశారు. అందులో డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్‌లో ఉండి లిఫ్ట్‌లోకి వస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ, రాజకీయ నాయకులు రష్మికకు మద్దతుగా నిలిచారు. అలాగే దీనిపై రష్మిక కూడా తన బాధను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. అయితే వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66డి ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1 లక్ష జరిమానా విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మికకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నేషనల్ క్రష్ బ్లాక్ డ్రెస్‌లో మాస్ స్టెప్స్ వేస్తున్నట్లు కనిపించింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫేక్ వీడియో అని ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఇలాంటి చేస్తున్నారని అలాంటి వారికి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story