రాజమౌళికి బిగ్ షాక్.. ‘వారణాసి’ టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటించిన డైరెక్టర్!

by Mallepaka Hamsa |

దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే.

రాజమౌళికి బిగ్ షాక్.. ‘వారణాసి’ టైటిల్‌తో కొత్త సినిమా ప్రకటించిన డైరెక్టర్!
X

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. 2027లో విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రకటన విడుదలైనప్పటికీ నుంచి ఇందుకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు ఉండటంతో అప్డేట్ ఇస్తారని అంతా భావించారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మహేష్ మెడలో ఉన్న లాకెట్‌కు మాత్రమే రిలీజ్ చేసి ఆశలన్నీ అడి ఆశలు చేశారు. ఇక నవబర్‌లో అతిపెద్ద అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో ఊపిరిపోసేలా చేశారు. నవంబర్ వచ్చినప్పటికీ ఎలాంటి అప్డేట్ విడుదల చేయకపోవడం గమనార్హం.

నవంబర్ 15న ఓ ఈవెంట్ నిర్వహించి టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుకస్తోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే.. ఈ చిత్రానికి ‘వారణాసి’టైటిల్ పరిశీలన చేస్తున్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే అధికారికంగా రాజమౌళి ప్రకటించబోతున్నట్లు టాక్. ఈక్రమంలో.. సడెన్‌గా సీ హెచ్ సుబ్బారెడ్డి ‘వారణాసి’టైటిల్‌తో తన కొత్త సినిమాను ప్రకటించి రాజమౌళికి షాకిచ్చాడు. అంతేకాకుండా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.రామబ్రహ్మ హనుమ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ముందే ఖరారు చేసినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి అదే టైటిల్‌ను అనౌన్స్ చేస్తాడా? లేక మరో పేరును ఫిక్స్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతున్నారా? అని సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story