హీరో Siddharth కు బిగ్ షాక్.. ప్రెస్‌మీట్ నుంచి తరిమిన నిరసనకారులు (వీడియో)

by Disha Web Desk 4 |
హీరో Siddharth కు బిగ్ షాక్.. ప్రెస్‌మీట్ నుంచి తరిమిన నిరసనకారులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సిద్ధార్థ్ కు చేదు అనుభవం ఎదురైతంది. తాజాగా తాను నటించిన ‘చిత్తా’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు ఒక్క సారిగా హాల్ లో కి ఎంటర్ అయ్యారు. తమిళ చిత్రాన్ని ఇక్కడ ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సిద్ధార్థ్‌కు వార్నింగ్ ఇచ్చారు. కాసేపు సిద్ధార్థ్ వారించేందుకు ప్రయత్నించినా నిరసనకారులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేం లేక తన సినిమాను ఆదరించండి అంటూ అక్కడి నుంచి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో సిద్ధార్థ్ తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed