అనుష్క ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మరోసారి 'ఘాటీ' రిలీజ్ డేట్ వాయిదా..? కారణం ఇదే..!

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఘాటీ’(Ghati).

అనుష్క ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మరోసారి ఘాటీ రిలీజ్ డేట్ వాయిదా..? కారణం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఘాటీ’(Ghati). స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ఎంటర్ టైన్‌మెట్స్ బ్యానర్స్ పై వంశీ కృష్ణా(Vamshi Krishna), రాజీవ్ రెడ్డి(Rajeev Reddy) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే లేడీ ఓరియేంటెడ్‌గా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడి జూలై 18న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ క్రమంలో ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఓ టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఇంకా సిజి పనులు పూర్తికాలేదని ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని రిలీజ్ లోపు ఫినిష్ చేయడం కుదరని తెలిసింది. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా వస్తుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అనుష్క ఫ్యాన్స్ ఫుల్ అప్‌సెట్ అవుతున్నారు.

Next Story