బ్రేకింగ్: Navadeep ను అరెస్ట్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులో హీరోకు బిగ్ రిలీఫ్..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: Navadeep ను అరెస్ట్ చేయొద్దు.. డ్రగ్స్ కేసులో హీరోకు బిగ్ రిలీఫ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. డ్రగ్స్ కేసులో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌లో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు జోరుగా వినిపించింది. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నాడని.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరో నవదీప్ డగ్స్ కేసుతో తనకు సంబంధంలేదని.. ఈ కేసులో తనను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో డ్రగ్స్ కేసులో నవదీప్‌కు భారీ ఊరట లభించింది.

ఇదిలా ఉంటే.. తాజా డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు 29వ నిందితునిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో నవదీప్‌కు విచారణకు హాజరు కావాలని సూచిస్తూ నోటీసులు జారీ చెయ్యనున్నారు. యాంటీ నార్కోటిక్ అధికారులు గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి గురువారం ముగ్గురు నైజీరియన్లతోపాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో నవదీప్ స్నేహితుడు కొల్లి రాంచంద్ కూడా ఉన్నాడు. రాంచంద్‌ను జరిపిన విచారణలో నవదీప్ కూడా డ్రగ్స్ కొని సేవిస్తున్నట్టు వెళ్లడయ్యింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను నిందితుల జాబితాలో చేర్చారు. గతంలో కూడా నవదీప్ పై డ్రగ్స్ సేవిస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓసారి ఎక్స్సైజ్ పోలీసుల విచారణను కూడా ఆయన ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : నాకు పచ్చబొట్లంటే పిచ్చి.. నటిని కాకపోతే అక్కడ కూడా వేయించుకునేదాన్ని


Next Story