- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ద హీరోలకు ఇమేజ్ అడ్డు వస్తుంది.. నాలాంటి వాళ్లే ఈ ప్రయాత్నాలు చేయాలి: విక్రాంత్
‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Praptirasthu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో విక్రాంత్(Vikranth).

దిశ, సినిమా: ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Praptirasthu)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో విక్రాంత్(Vikranth). ఇందులో ఆయనకు జోడీగా చాందినీ చౌదరి(Chandini Chowdhury) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో హీరో విక్రాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఒకరోజు శ్రీధర్ గారిని కలిసే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత ఆయన సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్ పంపించారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ ఇది. మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందా అనే సందేహం ఉండేది. అయితే స్క్రిప్ట్ కంప్లీట్ గా చదివాక ఎక్కడా లైన్ క్రాస్ కాకుండా, అసభ్యత లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా కథ ఉంది. దాంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగింది. పెద్ద హీరోలు ఇలాంటి మూవీస్ చేయరు. వారికి ఇమేజ్ అడ్డు వస్తుంది. నాలాంటి కొత్త వాళ్లే ఇలాంటి డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి.
ఈ మూవీలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను. ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. ఈ పాత్ర కోసం ఆరు కిలోల బరువు పెరిగాను. టిపికల్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లుక్ లోకి మారిపోయాను. ఇప్పుడున్న కపుల్స్ లో సంతాన సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు. సంతాన లేమి అనే సమస్యను మేము ఎక్కడా కామెడీ చేయలేదు. కాబట్టి ఎవర్నీ కించపరిచినట్లు ఉండదు. పైగా ఈ సినిమా చూశాక ఇన్ ఫెర్టిలిటీతో బాధపడుతున్న వారికి ఒక హోప్ కలుగుతుంది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని చెప్పుకొచ్చారు.






