నాని ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ లుక్ అప్డేట్‌కు మూహుర్తం ఫిక్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-06 12:17:23  IST  )

నేచురల్ స్టార్ నాని (nani) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise).

నాని ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ లుక్ అప్డేట్‌కు మూహుర్తం ఫిక్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (nani) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘దసరా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతుండటంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. దీంతో చిత్రబృందం కూడా ఈ సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌కు పలు ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు.

ఎస్.ఎల్. వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, మొత్తం 8 భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ వచ్చిన నాని వెరైటీ లుక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, నేచరల్ స్టార్ అభిమానులకు ‘ది ప్యారడైజ్’ టీమ్ బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 8న ఉదయం 10: 05 గంటలకు అలాగే సాయంత్రం 5: 05 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక పిస్తోల్‌ చివర్లో నాని నిల్చొని ఉన్నట్లు ఉన్న పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. అలాగే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లలో రెండు టైమింగ్స్ ఎందుకిచ్చారన్న అనుమానం మొదలైంది. డబుల్ అప్డేట్స్ వస్తున్నాయని అంతా ఖుషీ అవుతున్నారు.

link

Next Story