- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్..
మెగా హీరోలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi) సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మెగా హీరోలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi) సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, చిరు ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి డిసెంబర్ 13న రాబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్స్‌లో ఉంది. అందరూ మేకర్స్ ఇచ్చే సర్‌ప్రైజుల కోసం వెయిట్ చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతుంది. ఈ సినిమాలోని ఫస్ట్ పాట ‘డేఖ్ లేంగే సాలా’ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 6: 30 గంటలకు రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటిలో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నాయి. దీంతో పాటు చిరంజీవి సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుండటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా లా మారింది.
అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుందని సమాచారం. కానీ విడుదల తేదీని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి పోస్టర్స్, సాంగ్స్ విడుదల అవుతూ.. భారీ వ్యూస్ రాబడుతున్నాయి. ఇక చిరు అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల తేదీని మూవీ మేకర్స్ ఈరోజు సాయంత్రం 5:30గంటలకు వెల్లడించనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెట్టింట మొత్తం మెగా అభిమానుల హవా కొనసాగుతోంది.






