ఆమె కారణంగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న యాంకర్ రష్మి

by Disha Web Desk 7 |
ఆమె కారణంగా జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్న యాంకర్ రష్మి
X

దిశ, సినిమా: నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘జబర్దస్త్’ షోతో యాంకర్‌గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి. వచ్చీరాని తెలుగులో ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. కానీ అనసూయ, పలువురు కమెడియన్లు, జడ్జ్‌లు తప్పుకున్నాక ‘జబర్దస్త్’ రేటింగ్ మొత్తం పడిపోయింది. అయినప్పటికీ ఉన్నవారితో నడిపించుకొస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో నుంచి రష్మి కూడా తప్పుకుంటుందట.

‘జబర్దస్త్’ షోకి తాజాగా సౌమ్య కొత్త యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు జబర్దస్త్ షో కోసం కష్టపడిన రష్మి కంటే సౌమ్యకి ఎక్కువ పారితోషికం ఇస్తూ ఉండటంతో హర్ట్ అయిన రష్మి .. ఈ షో నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిందట. అది కూడా అగ్రిమెంట్ ప్రకారం ఈ షో నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుందట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ రష్మికి ఉన్న పాపులారిటీని జబర్దస్త్ షో గుర్తిస్తే బాగుంటుందనే టాక్ మాత్రం వినపడుతుంది.



Next Story

Most Viewed